హైదరాబాద్ లోని మసీదులో ఉచిత డయాలసిస్ కేంద్రం

  • లంగర్ హౌస్ లోని మస్జిద్ ఏ మహమ్మదియాలో ఏర్పాటు
  • కుల, మతాలకు అతీతంగా అందరికీ చికిత్స
  • అత్యున్నత వైద్య పరికరాలతో డయాలసిస్ యూనిట్
ప్రపంచంలోనే తొలిసారి హైదరాబాద్ లోని ఒక మసీదులో ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లంగర్ హౌస్ లోని మస్జిద్ ఏ మహమ్మదియాలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కులాలు, మతాలకు అతీతంగా అందరికి చికిత్స అందిస్తున్నారు. దీనికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ షోయబ్ అలీఖాన్ చీఫ్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్నారు. అన్ని సేవలను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీడ్ అజ్, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలు ఈ యూనిట్ ను ఏర్పాటు చేశాయి. 

అత్యున్నత నాణ్యత కలిగిన వైద్య పరికరాలతో ఈ డయాలసిస్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ లో డాక్టర్ అలీఖాన్ తో పాటు మరో డాక్టర్, నర్సులు, డయాలసిస్ టెక్నీషియన్లు, అంబులెన్స్ అందుబాటులో ఉన్నాయి. ఉచిత డయాలసిస్ సేవలు పొందాలనుకునే వారు 9603540864కి ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవచ్చు.


More Telugu News