రాష్ట్రపతి వీడ్కోలు కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నా వెళ్ల‌లేక‌పోతున్నాన‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌

  • రామ్ నాథ్ కోవింద్‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌క‌నున్న కేంద్రం
  • ఈ స‌భ‌కు ప‌వ‌న్‌కు ఆహ్వానం పంపిన కేంద్ర ప్ర‌భుత్వం
  • అనారోగ్యంతో వెళ్ల‌లేకపోతున్నాన‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌
భార‌త రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ ప‌దవీ కాలం ముగియనుండటంతో శుక్ర‌వారం (ఈ నెల 22) ఢిల్లీలో కేంద్ర ప్ర‌భుత్వం ఆయనకు ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌క‌నుంది. అట్ట‌హాసంగా నిర్వ‌హించ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి రావాలంటూ దేశంలోని కీల‌క నేత‌లంద‌రికీ ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది.

ఈ ఆహ్వ‌నాల్లో ఒక‌టి తెలుగు నేల‌కు చెందిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కూడా అందింది. ఈ విషయాన్ని ప‌వ‌న్ గురువారం రాత్రి ప్ర‌క‌టించారు. అయితే అనారోగ్య కార‌ణాల వ‌ల్ల తాను ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌డం లేద‌ని ఆయ‌న తెలిపారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ర్య‌ట‌న అనంత‌రం ప‌వ‌న్ వైర‌ల్ ఫీవ‌ర్‌కు గురైన సంగ‌తి తెలిసిందే.

ఈ వేడుక‌కు త‌న‌ను ఆహ్వానించిన ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ప‌వ‌న్‌... ఈ చారిత్ర‌క స‌భ‌కు అనారోగ్య కార‌ణాల‌తో హాజ‌రుకాలేక‌పోతున్నాన‌ని తెలిపారు. ఎలాంటి పొర‌పొచ్చాల‌కు తావులేకుండా రామ్ నాథ్ కోవింద్ ప‌నిచేశార‌ని ప‌వ‌న్ కొనియాడారు. 


More Telugu News