అప్పటికే బోటు మారడంతో త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న చంద్రబాబు
- కోనసీమలో వరద బాధితుల పరామర్శకు వెళ్లిన బాబు
- సోంపల్లి వద్ద తెగిపోయిన పంటు ర్యాంపు
- నీళ్లలో పడిపోయిన దేవినేని ఉమ, పితాని, రామ్మోహన్
- సకాలంలో లైఫ్ జాకెట్లు అందించడంతో అంతా క్షేమం
కోనసీమ జిల్లాలో గోదావరి వరద బాధితులను చంద్రబాబు పరామర్శించేందుకు వెళ్లగా, ఆయన పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకోవడం తెలిసిందే. టీడీపీ నేతలు గోదావరి నీటిలో పడిపోగా, సిబ్బంది వారిని కాపాడారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన పంటు ర్యాంపు తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఈ ఘటనలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, రామ్మోహన్, ఎన్ఎస్ జీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు గోదావరి నీటిలో పడిపోయారు.
అయితే, అప్పటికే చంద్రబాబు మరో బోటులోకి మారడంతో ఆయనకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చంద్రబాబు సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, నీటిలో పడిపోయిన వారికి సకాలంలో లైఫ్ జాకెట్లు అందించడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. కోనసీమ జిల్లా సోంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది.