యూఏఈ నుంచి పదేళ్ల గోల్డెన్ వీసా అందుకున్న కమలహాసన్

  • కమలహాసన్ కు అరుదైన గౌరవం
  • గోల్డెన్ వీసా బహూకరించిన యూఏఈ అధికారులు
  • కృతజ్ఞతలు తెలిపిన కమల్
విలక్షణ నటుడు కమలహాసన్ కు అరుదైన గౌరవం లభించింది. కమల్ కు యూఏఈ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక గోల్డెన్ వీసాను అందించింది. ఇది పదేళ్ల కాలపరిమితితో కూడిన వీసా. తనకు గోల్డెన్ వీసా మంజూరు చేయడం పట్ల కమలహాసన్ ఎమిరేట్స్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు తనకు గోల్డెన్ వీసా అందిస్తున్నప్పటి ఫొటోలను కూడా కమల్ పంచుకున్నారు. 

అంతేకాకుండా, ప్రతిభావంతులకు, సృజనాత్మక కళాకారులకు మద్దతుగా నిలుస్తోందంటూ దుబాయ్ ఫిల్మ్ అండ్ టీవీ కమిషన్ కు కమల్ ధన్యవాదాలు తెలిపారు. యూఏఈ గోల్డెన్ వీసాను గతంలో మలయాళ సూపర్ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టి కూడా అందుకున్నారు.


More Telugu News