ద్రౌప‌ది ముర్ము ఇంటికెళ్లి అభినంద‌న‌లు తెలిపిన మోదీ

  • మూడో రౌండ్ పూర్తి కాకుండానే విజ‌యం సాధించిన ముర్ము
  • ముర్ము విజ‌యం వార్త తెలియ‌గానే ఆమె ఇంటికి వెళ్లిన మోదీ
  • జేపీ న‌డ్డాతో క‌లిసి ముర్ముకు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాని
భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ద్రౌప‌ది ముర్ము ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండానే త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాపై భారీ మెజారిటీతో ముర్ము విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. ఈ రౌండ్ పూర్తయ్యాక ముర్ముకు మొత్తం మీద ద‌క్కిన ఓట్లెన్ని అన్న విష‌యం తేల‌నుంది.

ఇదిలా ఉంటే... నేటి రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో ముర్ము త‌న విజ‌యానికి స‌రిప‌డ మేర ఓట్ల‌ను సాధించార‌న్న స‌మాచారం తెలియ‌గానే... ప్రధాని మోదీ నేరుగా ముర్ము నివాసానికి బ‌య‌లుదేరారు. అప్ప‌టికే అక్కడికి చేరుకున్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డాతో క‌లిసి ముర్ముతో భేటీ అయిన మోదీ... భార‌త నూత‌న రాష్ట్రప‌తిగా ఎన్నికైన ఆమెకు అభినంద‌న‌లు తెలిపారు. ఈ సందర్భంగా ముర్ము వ్యక్తిత్వాన్ని, విజయాన్ని ఆకాశానికెత్తేసిన మోదీ... ఆమెకు ఓటేసిన ప్రజా ప్రతినిధులను అభినందిస్తూ వరుస ట్వీట్లు చేశారు.


More Telugu News