అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సోకిన కరోనా
- వైట్ హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్న బైడెన్
- రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు తీసుకున్నా వైరస్ సోకిన వైనం
- ఐసోలేషన్‌లో ఉన్నా విధులు నిర్వర్తిస్తున్నారన్న వైట్ హౌస్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మేరకు గురువారం రాత్రి అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా బారిన పడ్డ బైడెన్‌కు స్వల్పంగానే వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలిపిన వైట్ హౌస్... ప్రస్తుతం ఆయన అధ్యక్ష భవనంలోనే ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపింది.
కరోనా నుంచి రక్షణ కోసం ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తో పాటు ఇటీవలే బూస్టర్ డోస్‌ను కూడా బైడెన్ తీసుకున్నారు. అయినా కూడా ఆయన కరోనా బారిన పడటం గమనార్హం. కరోనా సోకిన కారణంగా ఐసోలేషన్‌లోనే ఉన్నా... బైడెన్ తన అధికారిక విధులను నిర్వర్తిస్తున్నారని వైట్ హౌస్ తెలిపింది.