అలసినట్టుగా అనిపిస్తే విరామం తీసుకోవచ్చు... సోనియా గాంధీకి ఈడీ వెసులుబాటు!

  • నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాకు సమన్లు
  • మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ
  • నేడు మూడు గంటల పాటు ప్రశ్నించిన వైనం
  • సోనియా ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఈడీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (75) నేడు నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆమెను ఈడీ అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నందున తనను గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించే గదిలో విచారించాలని సోనియా ఈడీ అధికారులను కోరారు. అంతేకాదు, తనను విచారించే ఈడీ అధికారులు, ఇతర సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకున్నారా? అని ఆరా తీశారు. 

సోనియా పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆమె పట్ల సానుకూల ధోరణి కనబర్చారు. అలసిపోయినట్టుగా అనిపిస్తే విరామం తీసుకునే వెసులుబాటు కల్పించారు. విచారణ జరుగుతున్నంత సేపు ప్రియాంక గాంధీ అదే భవంతిలో మరో గదిలో కూర్చున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వడానికి ఆమె వద్ద సోనియాకు అవసరమైన ఔషధాలు ఉన్నాయి. 




More Telugu News