కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కే అర్హత లేదు: కేంద్ర ప్రభుత్వం
- కాళేశ్వరానికి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లేదన్న కేంద్రం
- ఈ కారణంగానే ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని వెల్లడి
- పార్లమెంటు వేదికగా తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణలో అతి పెద్ద ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటు వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా దక్కే అర్హత లేదని కేంద్రం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లేదన్న కేంద్రం... ఈ కారణంగానే ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని తేల్చి చెప్పింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించే ప్రతిపాదన ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు స్పందించిన కేంద్ర జల శక్తి శాఖ పార్లమెంటుకు గురువారం సమాధానం చెప్పింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని చిన్న చిన్న ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇస్తున్న నరేంద్ర మోదీ సర్కారు... తెలంగాణలో కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇవ్వడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న వేళ కేంద్రం ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.