కేసీఆర్ కు చెపుతున్నా.. మహారాష్ట్రలో జరిగిందే తెలంగాణలో కూడా జరుగుతుంది: రాజాసింగ్
- టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఎక్కువగా ఉందన్న రాజాసింగ్
- పదవులు ఉంటాయనే నమ్మకం మంత్రులు, ఎమ్మెల్యేలకు లేదని వ్యాఖ్య
- మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో జరిగిందే తెలంగాణలో కూడా జరగబోతోందని ఆయన జోస్యం చెప్పారు. శివసేన రెబెల్ ఎంపీ ఏక్ నాథ్ షిండే... ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి, బీజేపీ అండతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన సంగతి తెలిసిందే. ఇలాంటిదే తెలంగాణలో కూడా జరగబోతోందనే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెపుతున్నానని రాజాసింగ్ అన్నారు.
టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి చాలా ఎక్కువగా ఉందని... తమ పదవులు ఉంటాయనే నమ్మకం మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదని రాజాసింగ్ చెప్పారు. ఏ క్షణంలోనైనా వారు పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉందని అన్నారు. ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు పంచడానికే వరద సహాయ నిధులను ఆ పార్టీ అడుగుతోందని విమర్శించారు.