యమహా బైక్ ప్రేమికులకు శుభవార్త... మార్కెట్లోకి మళ్లీ వస్తున్న 'ఆర్ఎక్స్100'
- గతంలో బైక్ ప్రియులను అలరించిన ఆర్ఎక్స్100
- యమహా-ఎస్కార్ట్స్ గ్రూప్ భాగస్వామ్యంలో తయారీ
- 1996 నుంచి నిలిచిన ఉత్పత్తి
- ఇతర బైక్ ల వైపు మళ్లిన కుర్రకారు
- ఆధునిక హంగులతో తాజాగా వస్తున్న ఆర్ఎక్స్100
కొన్ని దశాబ్దాలుగా యువతను అలరిస్తున్న బైక్ లలో ఆర్ఎక్స్100 ఒకటి. దీని తయారీదారు జపాన్ కు చెందిన యమహా కంపెనీ. ఎంతో స్టయిలిష్ లుక్ తో ఉండే ఈ బైక్ ను కాలేజీ కుర్రకారు అమితంగా ఇష్టపడేది. అయితే, గత కొన్నాళ్లుగా ఈ బైక్ ఉత్పాదనను కంపెనీ నిలిపివేసింది. యమహా-ఎస్కార్ట్స్ గ్రూపు భాగస్వామ్యంలో 1985 నుంచి ఉత్పత్తి చేస్తున్న ఈ బైక్ ను 1996 వరకు కొనసాగించారు. తదనంతర కాలంలో ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో కుర్రకారు ఇతర బైక్ ల వైపు మళ్లారు.
ఈ నేపథ్యంలో యమహా కంపెనీ ఆర్ఎక్స్100 ప్రేమికులకు శుభవార్త చెప్పింది. ఈ బైక్ ను ఆధునిక హంగులతో మళ్లీ మార్కెట్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. సరికొత్త రూపులో ఆర్ఎక్స్100ను తీసుకువస్తున్నట్టు యమహా మోటార్ ఇండియా విభాగం చైర్మన్ ఇషిన్ చిహానా వెల్లడించారు. అయితే, గతంలో ఉన్న 2 స్ట్రోక్ ఇంజిన్ ఇప్పటి ఉద్గారాల ప్రమాణాల నిబంధనల వల్ల ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు.