డాక్టర్ వేణు సంకోజుకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు
- దాశరథి పేరిట అవార్డును ఇస్తున్న తెలంగాణ సర్కారు
- 2022 ఏడాదికి వేణు సంకోజుకు అవార్డు ప్రకటన
- ఈ నెల 22న అవార్డు ప్రదానోత్సవం
శ్రీ దాశరథి కృష్ణమాచార్య పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డును 2022కు గానూ ప్రముఖ కవి డాక్టర్ వేణు సంకోజు అందుకోనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటన చేసింది. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని నినదించిన తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్యను స్మరించుకుంటూ తెలంగాణ సర్కారు ఈ అవార్డును ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2022 ఏడాదికి సంబంధించి వేణు సంకోజును ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ అవార్డు కింద రూ. 1,01,116 (ఒక లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలు) నగదు పారితోషకంతో పాటు జ్ఞాపికను వేణు సంకోజుకు ప్రభుత్వం అందజేయనుంది. ఈ అవార్డు ప్రదానోత్సవాన్ని ఈ నెల 22న (శుక్రవారం) నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నల్లగొండ జిల్లాకు చెందిన డాక్టర్ వేణు సంకోజు ప్రస్తుతం తెలంగాణ రైటర్స్ ఫోరమ్ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.