రేపటి నుంచి జరగాల్సిన జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షల రద్దు... తిరిగి ఈ నెల 25 నుంచి మొదలు
- పరీక్షల వాయిదాకు కారణాలు వెల్లడించని ఎన్టీఏ
- పరీక్షకు ఒక రోజు ముందుగా వాయిదా ప్రకటన
- రేపటి నుంచి అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచనున్న ఎన్టీఏ
దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇదివరకు విడుదలైన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు ఈ నెల 21 (గురువారం) నుంచి ఈ నెల 30 వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే పరీక్షకు ఒక రోజు ముందుగా ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం సాయంత్రం ప్రకటించింది. పరీక్షల వాయిదాకు గల కారణాలను ఎన్టీఏ వెల్లడించలేదు.
ఈ క్రమంలో జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలను ఈ నెల 25 నుంచి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను గురువారం నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించిన ఎన్టీఏ.. ఈ నెల 11న ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.