ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులను సిఫారసు చేసిన కొలీజియం
- సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని కొలీజియం సిఫారసు
- రాష్ట్రపతి ఆమోదం తర్వాత బాధ్యతలు చేపట్టనున్న నూతన న్యాయమూర్తులు
- ప్రస్తుతం న్యాయాధికారులుగా పనిచేస్తున్న కొత్త జడ్జిలు
ఏపీ హైకోర్టుకు త్వరలోనే మరో ఏడుగురు న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు ఏపీ హైకోర్టుకు ఏడుగురు నూతన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. ఈ సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం లభించగానే.. ఏడుగురు న్యాయమూర్తులు హైకోర్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు.
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన వారిలో అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యామ్ సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మినరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు. న్యాయాధికారులుగా పనిచేస్తున్న వీరికి న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం సిఫారసు చేసింది.