వైసీపీ నేతలతో బ్యాంకాక్ వెళ్లిన దర్శి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
- అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లిన ఎస్సై
- దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ
- తాజాగా చంద్రశేఖర్‌ను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు
ప్రకాశం జిల్లా దర్శి ఎస్సై చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. దర్శి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలతో కలిసి చంద్రశేఖర్ ఇటీవలే బ్యాంకాక్ వెళ్లిన విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అధికారిగా ఉండి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ఆయన వైసీపీ నేతలతో కలిసి ఫారిన్ టూర్‌కు వెళ్లారని ప్రచారం జరగగా... దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి కాగా.. వైసీపీ నేతలతో కలిసి విదేశాలకు వెళ్లే సందర్భంగా చంద్రశేఖర్ ఎలాంటి అనుమతి తీసుకోలేదని తేలింది. దీంతో చంద్రశేఖర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ... ఆయనను విధుల నుంచి తప్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.