పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్... 24న జనవాణి రద్దు
- ఉభయ గోదావరి జిల్లాల పర్యటన తర్వాత పవన్‌కు అస్వస్థత
- పవన్‌తో పాటు జనసేన నేతలు, పవన్ సెక్యూరిటీ గార్డులకూ వైరల్ ఫీవర్
- ఈ నెల 31న తదుపరి జనవాణి నిర్వహిస్తామన్న నాదెండ్ల
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఇటీవలే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలోనే పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం మధ్యాహ్నం ప్రకటించారు. పవన్‌తో పాటు ఈ పర్యటనలో పాలుపంచుకున్న పలువురు పార్టీ నేతలు, పవన్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా వైరల్ ఫీవర్ సోకిందని ఆయన వెల్లడించారు.
పవన్‌కు వైరల్ ఫీవర్ సోకిన కారణంగా ఈ నెల 24న (ఆదివారం) నిర్వహించనున్న జనవాణిని రద్దు చేస్తున్నట్లు నాదెండ్ల ప్రకటించారు. తదుపరి జనవాణిని ఈ నెల 31న నిర్వహిస్తామని, ఏ ప్రాంతంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించనున్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. జనం సమస్యలను సేకరించి ప్రభుత్వానికి పంపేందుకు జనవాణి పేరిట జనసేన ఇటీవలే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. విజయవాడలో రెండు, భీమవరంలో ఓ జనవాణి కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.