ఈ ఫొటోలు ఎక్క‌డో విదేశాల్లోని సీన్లు కాదు... మ‌న ఓఆర్ఆర్‌వే!

  • ప్రారంభ‌మైన వ‌ర్షాకాలం
  • ఓఆర్ఆర్ పొడ‌వునా పర‌చుకున్న‌ ప‌చ్చ‌ద‌నం
  • ఫొటోల‌ను పంచుకున్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి అర‌వింద్ కుమార్‌
వ‌ర్షాకాలం మొద‌లైపోయింది. మొన్న‌టిదాకా ఎండ‌లు మండిపోగా... ఇప్పుడు వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. వెర‌సి ఖాళీ ప్ర‌దేశాల్లో ప‌చ్చిక మొల‌కెత్తుతోంది. ఇలాంటి క్ర‌మంలో హైద‌రాబాద్ న‌గ‌రం చుట్టూరా ఉన్న అవుట‌ర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వెంట ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఓఆర్ఆర్ పొడ‌వునా... ఎక్కడ చూసినా ప‌చ్చద‌న‌మే క‌నిపిస్తోంది. వెర‌సి సినిమాల్లో చూపించే సుంద‌ర దృశ్యాల‌కు ఏమాత్రం తీసిపోనిదిగా ఓఆర్ఆర్ క‌నిపిస్తోంది.

ఓఆర్ఆర్ తాజా ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న విష‌యాన్ని చెబుతూ తెలంగాణ ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి అర‌వింద్ కుమార్ బుధ‌వారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓఆర్ఆర్ మీద వేర్వేరు ప్రాంతాల్లో తీసిన తాజా ఫొటోల‌ను కూడా ఆయ‌న జ‌త చేశారు. ఓఆర్ఆర్ ఇలా అత్యంత సుంద‌రంగా, ఆహ్లాద‌క‌రంగా మారిపోవ‌డానికి హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్‌ల కృషే కార‌ణ‌మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.


More Telugu News