దేశంలో లక్షన్నరకు చేరువవుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 20,557 కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా 40 మంది మృతి
- 1,45,654కి పెరిగిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 20,557 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 15 వేల వరకు కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 18,517 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే సమయంలో 40 మంది మరణించారు. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువవుతోంది. ప్రస్తుతం దేశంలో 1,45,654 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో ఇప్పటి వరకు 4,31,32,140 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 2,00,61,24,684 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 6,11,01,105 మంది ప్రికాషన్ డోసు వేయించుకున్నారు.