బీహెచ్ఈఎల్ జంక్షన్లో ఫ్లై ఓవర్ కు రూ.130.65 కోట్లు మంజూరు చేసిన నితిన్ గడ్కరీ
- 1.65 కి.మీ. మేర ఫ్లై ఓవర్ నిర్మాణం
- ఇకపై తగ్గనున్న ట్రాఫిక్ చిక్కులు
- కేంద్రమంత్రికి థ్యాంక్స్ చెప్పిన కిషన్ రెడ్డి
పూణె- హైదరాబాద్ మధ్య 65వ నంబర్ జాతీయ రహదారిలో బీహెచ్ ఈఎల్ జంక్షన్ లో 1.65 కిలోమీటర్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. దీని నిర్మాణం కోసం రూ.130.65 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ఈ ఏడాది ఏప్రిల్ 29న శంషాబాద్ దగ్గర జరిగిన సభలో నితిన్ గడ్కరీ శంకుస్ధాపన చేశారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మించాలని ప్రతిపాదన ఉంది. తాజాగా ఈ ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసింది.
హైదరాబాద్ నుంచి జహీరాబాద్, నాగ్ పూర్, పూణె లోని ఇండస్ర్టియల్ కారిడార్ కు నిత్యం వేల సంఖ్యలో గూడ్స్ వాహనాలు, సాధారణ వాహనాలు వెళ్తుంటాయి. దాంతో, బీహెచ్ ఈ ఎల్ దగ్గర తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. తాజా ఫ్లై ఓవర్ తో ఇన్నేళ్ల ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభిస్తుంది. కాగా, ఈ ఫ్లై ఓవర్ కు నిధులు విడుదల చేసినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజల తరుపున నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని ఓ ప్రకటనలో ఆయన తెలిపారు.