ఐక్యూ 10 సిరీస్ ఫోన్ల విడుదల.. అదిరిపోయిన డిజైన్

  • 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • ప్రపంచంలో ఇటువంటి తొలి ఫోన్ గా ఐక్యూ10 ప్రో రికార్డ్
  • రూ.44వేల నుంచి ధరలు మొదలు
  • త్వరలో భారత మార్కెట్ కు పరిచయం
ఐక్యూ 10 సిరీస్ ఫోన్లు చైనా మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఎంతో ఆకట్టుకునే డిజైన్ తో వీటిని కంపెనీ రూపొందించింది. ఐక్యూ10, ఐక్యూ10 ప్రో పేరుతో వీటిని తీసుకొచ్చింది. వీటిల్లో పలు ప్రత్యేకతలు వున్నాయి. ముఖ్యంగా ఐక్యూ10 ప్రో 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ప్రపంచంలో 200 వాట్ చార్జింగ్ ను సపోర్ట్ చేసే తొలి ఫోన్ ఇదే. 

ఐక్యూ 10 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ మోడల్ ధర చైనా కరెన్సీలో 3,699 యువాన్లు. మన కరెన్సీలో రూ.43,900. 8జీబీ, 256 జీబీ ధర 3,999 యువాన్లు. మన కరెన్సీలో రూ.47,400. 12జీబీ, 256జీబీ మోడల్ ధర 4,299 యువాన్లు. మన రూపాయిల్లో రూ.51,000. 12జీబీ, 512జీబీ ధర 4,699 యువాన్లు కాగా, మన కరెన్సీలో రూ.55,700. ఐక్యూ10 ప్రో 8జీబీ, 256జీబీ స్టోరేజీ ధర 4,999 యువాన్ల నుంచి మొదలవుతోంది. 

ఐక్యూ10 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జనరేషన్ 1 చిప్ సెట్ తో వస్తుంది. వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా కాగా, ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు.

ఐక్యూ10 ప్రో 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 8ప్లస్ 1 చిప్ సెట్, 120 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటు, వైర్ లెస్ చార్జింగ్, వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా, 4,700 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది. ఐక్యూ10, 10 ప్రో ఫోన్లు త్వరలో భారత మార్కెట్ కు సైతం రానున్నాయి. 




More Telugu News