ప్రీమియం రైళ్లలో టీ, కాఫీలపై ఆన్ బోర్డ్ సర్వీస్ ఛార్జీ రద్దు
- టికెట్ రిజర్వేషన్ సమయంలోనే ఆహారం బుకింగ్
- రైల్లోకి వచ్చిన తర్వాత బుక్ చేసేవారికి రూ.50 అదనపు ఛార్జీ
- కాఫీ, టీలపై తాజాగా మినహాయింపు
- భోజనంపై సర్వీస్ ఛార్జీ కొనసాగింపు
ఇప్పటిదాకా ప్రీమియం రైళ్లలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలను ముందుగా బుక్ చేసుకోకుండా, రైల్లో ఎక్కిన తర్వాత బుక్ చేసుకుంటే రూ.50 ఆన్ బోర్డు సర్వీస్ ఛార్జీ విధిస్తుండడం తెలిసిందే. ముందుగా బుక్ చేసుకోని ప్రయాణికులపై అదనపు వడ్డన పడేది. రైల్లో ఎక్కిన తర్వాత రూ.20లతో టీ కొనుగోలు చేస్తే, అదనంగా రూ.50 ఆన్ బోర్డ్ సర్వీస్ ఛార్జీతో మొత్తం రూ.70 మేర మోత మోగేది. కాఫీ, టీలపై ఇప్పుడీ సర్వీస్ ఛార్జీని రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది.
వందేభారత్, శతాబ్ది, రాజధాని, దురంతో వంటి ప్రీమియం ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణించేవారు కాఫీ, టీలను అప్పటికప్పుడు కొనుగోలు చేసినా ఇకపై సర్వీసు ఛార్జీ వసూలు చేయరు. అయితే, భోజన పదార్థాలపై మాత్రం సర్వీస్ ఛార్జీ వడ్డన కొనసాగనుంది.