నేను ఏం నేరం చేశాను?... ఎన్ఐఏ సోదాలపై మావోయిస్టు ఆర్కే భార్య ఆవేదన!
- స్థానిక పోలీసులతో కలిసి సోదాలు చేస్తున్న ఎన్ఐఏ
- విరసం నేత కల్యాణ్ రావు ఇంటిలోనూ సోదాలు
- భర్త మరణంతో బాధపడుతుంటే వేధిస్తారా? అంటూ ఎన్ఐఏపై శిరీష ఆగ్రహం
మావోయిస్టు దివంగత నేత రామకృష్ణ అలియాస్ ఆర్కే భార్య శిరీష ఇంటిలో మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. ప్రకాశం జిల్లా అలకూరపాడులోని శిరీష ఇంటితో పాటు విప్లవ రచయితల సంఘం నేత కల్యాణ్ రావు ఇంటిలోనూ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. అదే మాదిరిగా విజయవాడ సింగ్ నగర్ లోని దొడ్డి ప్రభాకర్ ఇంటిలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు.
స్థానిక పోలీసుల సహకారంతో ఆయా ప్రాంతాల్లో సోదాలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు ఆ పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ సోదాలపై శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదాల పేరిట ఎన్ఐఏ అధికారులు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు. ఓపక్క భర్త మరణంతో బాధపడుతుంటే.. సోదాల పేరుతో వేధిస్తారా? అని ఆమె అధికారులను నిలదీశారు. అసలు తానేం నేరం చేశానో చెప్పాలని ఆమె వారిని ప్రశ్నించారు. నేరం చేసిన వాళ్లు నిర్భయంగా రోడ్లపై తిరుగుతుంటే.. ఏ నేరం చేయని తనను మహిళ అని కూడా చూడకుండా ఇబ్బంది పెడతారా? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.