ఎగిరిపోయిన పెంపుడు చిలుక... ఆచూకీ చెబితే రూ.50 వేలు!
- కర్ణాటకలోని తుముకూరులో ఘటన
- రెండు చిలుకలు పెంచుకుంటున్న జయనగర్ కాలనీ వాసి రవి
- వాటిలో రుస్తుమా అనే చిలుక మిస్సింగ్
- చిలుక బొమ్మతో పోస్టర్లు వేసిన రవి
కర్ణాటకలోని తుముకూరుకు చెందిన రవి అనే వ్యక్తి ఎంతో ముచ్చటపడి రెండు చిలుకలు పెంచుకుంటున్నాడు. ఆ రెండు చిలుకలు ఆఫ్రికన్ గ్రే రకానికి చెందినవి. వాటికి రవి కుటుంబం పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహిస్తుంది. ఇప్పుడు వాటిలో ఒకటి ఎటో వెళ్లిపోయింది. తప్పిపోయిన ఆ చిలుక పేరు రుస్తుమా. ఎంతో ప్రేమగా పెంచుకునే చిలుకల్లో ఒకటి కనిపించకుండా పోవడంతో రవి కుటుంబం విచారంలో మునిగిపోయింది.
ఈ నెల 16 నుంచి రుస్తుమా కనిపించకుండా పోయింది. దాంతో, రవి తన చిలుక ఆచూకీ తెలియజేసిన వారికి రూ.50 వేలు ఇస్తానంటూ ప్రకటన ఇచ్చాడు. చిలుక బొమ్మతో కూడిన పోస్టర్లను తాము నివసించే జయనగర్ కాలనీలోనే కాకుండా, పరిసర ప్రాంతాల్లోనూ అంటించాడు. ఆ చిలుకను తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తామని, ఇప్పుడది తమ వద్ద లేకపోవడం తీవ్రంగా బాధిస్తోందని రవి పేర్కొన్నాడు.