షర్టు లేకుండా ఎలాన్ మస్క్.. ఇదేం దారుణమంటూ నెటిజన్ల కామెంట్లు
- హతవిధీ ఎలాన్ మస్క్ ను ఇలా చూడాల్సి వచ్చిందే అంటూ ఓ నెటిజన్ పోస్టు
- మొత్తానికి మస్క్ మనిషి అవతారంలోకి వచ్చాడన్న మరో నెటిజన్
- అప్పుడప్పుడూ షర్ట్ లేకుండా కనిపించి ఉండాల్సిందంటూ ఎలాన్ మస్క్ స్పందన
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ షర్ట్ లేకుండా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ఇంటర్నెట్ లో కలకలం రేపుతున్నాయి. గ్రీస్ లోని మైకోనోస్ లో పర్యటిస్తున్న మస్క్.. ఓ ప్రత్యేక లగ్జరీ యాచ్ లో సముద్ర తీరంలో ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ నీటిలో ఎంజాయ్ చేస్తూ డ్రింక్స్ తాగుతున్న ఫొటోలు, ఆయన తోపాటు స్నేహితులు ఫ్యాషన్ డిజైనర్ సారా స్టాడింజర్, ఆమె భర్త అరి ఎమ్మాన్యుయేల్, మరి కొందరు కూడా ఉన్న ఫొటోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి.
ట్విట్టర్ లో వైరల్ గా..
మస్క్ నలుపు రంగు స్విమ్మింగ్ షార్ట్ వేసుకుని, పైన బనియన్, చొక్కా వంటివేమీ లేకుండా తచ్చాడుతున్న ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కామెంట్లు మొదలుపెట్టారు. “హతవిధీ ఇవాళ ఎలాన్ మస్క్‌ను షర్ట్ లేకుండా చూడాల్సి వచ్చిందే. గ్రీస్ లో ఎంజాయ్ చేస్తున్న మస్క్, ఆయన స్నేహితులను చూడండి” అంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు.

- ‘‘ట్విట్టర్ తో 44 బిలియన్ డాలర్ల లీగల్ పోరాటం చేస్తున్న వేళ కూడా ఏ మాత్రం బాధ లేకుండా ఇలా ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు’ అంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు.
- ‘‘ఎలన్ నాకు నచ్చారు. నేను నా డబ్బంతా ఈయన వద్ద పెట్టుబడి పెడతాను” అని మరో ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేయగా.. ఎలాన్ మస్క్ స్పందించారు. “ఇదేదో బాగుంది.. నేను తరచూ షర్ట్ లేకుండా కనిపిస్తూ ఉండాల్సింది...” అని పేర్కొన్నారు.
- ఎలాన్ మస్క్, ఆయన స్నేహితులు ఎంజాయ్ చేస్తున్న ఖరీదైన యాచ్ కు సంబంధించిన వివరాలను ఓ మీడియా సంస్థ ప్రస్తావించింది. ఆ యాచ్ లో ఆరుగురికి సరిపడా మూడు కేబిన్లు ఉంటాయని.. అందులో గడిపేందుకు వారానికి 20 వేల డాలర్లు (మన కరెన్సీలో రూ.16 లక్షలు) ఖర్చవుతుందని తెలిపింది. యాచ్ లో ఫుడ్, ఇతర సేవలు అందించేందుకు సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని తెలిపింది.