ఎల్లుండి ఈడీ విచారణకు హాజరు కానున్న సోనియా గాంధీ
- నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాకు ఈడీ సమన్లు
- అనారోగ్య కారణాలతో గడువు కోరిన సోనియా
- తాజాగా ఈ నెల 21న విచారణకు రావాలంటూ ఈడీ సమన్లు
- ఇదివరకే ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ నెల 21న (గురువారం) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో నడిపిన పత్రిక నేషనల్ హెరాల్డ్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన కేసులో తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ సోనియాకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ సమన్ల మేరకు సోనియా గాంధీ గురువారం విచారణకు హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
గతంలోనే విచారణకు రావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లకు స్పందించిన సోనియా... అనారోగ్య కారణాల వల్ల ఇప్పటికిప్పుడు విచారణకు హాజరు కాలేనని, 3 వారాల తర్వాత విచారణకు హాజరవుతానని తెలిపిన సంగతి తెలిసిందే. సోనియా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఈడీ అధికారులు ఈ నెల 21 విచారణకు హాజరుకావాలంటూ ఇటీవలే నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే గురువారం సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఇప్పటికే రాహుల్ గాంధీని ఈడీ అధికారులు 5 రోజుల పాటు విచారించిన సంగతి తెలిసిందే.