వాయిదా పడిన తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షకు కొత్త తేదీల ఖరారు
- తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు
- వాయిదాపడిన పలు పరీక్షలు
- ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష కూడా వాయిదా
- వాయిదాపడిన అగ్రికల్చర్ పరీక్ష ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహణ
తెలంగాణలో ఇటీవలి వరకు భారీ వర్షాలు అతలాకుతలం చేయడం తెలిసిందే. దానికితోడు వరదలు సంభవించాయి. దాంతో తెలంగాణలో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదాపడింది. తాజాగా ఈ పరీక్షకు కొత్త తేదీలు ప్రకటించారు. తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి వెల్లడించారు.
అంతేకాకుండా, ఆగస్టు 1న ఈసెట్, ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు పీజీఈసెట్ పరీక్షలు జరపనున్నట్టు వివరించారు. అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్ల నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.