కోహ్లీ సమస్యను పరిష్కరించడానికి నాకు 20 నిమిషాలు చాలు: గవాస్కర్
- దారుణమైన ఫామ్ లో కోహ్లీ
- రెండున్నరేళ్లుగా సెంచరీల కరవు
- కెప్టెన్సీ కోల్పోయిన వైనం
- జట్టులోనూ చోటు ప్రశ్నార్థకమవుతున్న తీరు
టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఆట పరంగా తన కెరీర్ లోనే అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాడు. పరుగుల దాహం తీరేలా ఒక్క సెంచరీ చేస్తే చాలనుకుంటూ గత రెండున్నరేళ్లుగా అలమటిస్తున్నాడు. ఫామ్ లో లేక, జట్టును సమర్థంగా నడిపించలేక కెప్టెన్సీని కూడా కోల్పోయిన కోహ్లీ... జట్టులోనూ తన చోటును ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో, కోహ్లీ పరిస్థితి పట్ల మాజీ క్రికెటర్లు, సమకాలికులు సానుభూతి ప్రదర్శిస్తున్నారు.
తాజాగా, ఈ అంశంపై భారత మాజీ సారథి సునీల్ గవాస్కర్ స్పందించారు. ఒక్క 20 నిమిషాల పాటు కోహ్లీతో మాట్లాడి, అతడి బ్యాటింగ్ సమస్యలను పరిష్కరించగలనని ధీమా వ్యక్తం చేశారు. కోహ్లీ ఆటతీరులోని లోపాల గురించి చర్చించి, వాటి నుంచి బయటపడేందుకు ఏంచేయాలో సూచిస్తానని వివరించారు.
ముఖ్యంగా, ఆఫ్ స్టంప్ ఆవల పడే బంతులను ఆడబోయి అవుట్ కావడం కోహ్లీకి బలహీనతగా మారిన నేపథ్యంలో, ఈ అంశాన్ని కూడా చర్చిస్తానని గవాస్కర్ వెల్లడించారు. తాను ఓపెనర్ ను అని, ఆఫ్ స్టంప్ లైన్ బంతులు సృష్టించే సమస్యల పట్ల తనకు అవగాహన ఉందని అన్నారు. తన సూచనలు, సలహాలతో ఇప్పటికిప్పుడు కోహ్లీ పరిస్థితి మారిపోతుందని చెప్పలేనని, కానీ కొంతమేర కోహ్లీకి ఉపయోగపడొచ్చని భావిస్తున్నానని తెలిపారు.