చిరంజీవిని ఊసరవెల్లి అంటూ సంబోధించిన సీపీఐ నారాయణ
- అల్లూరి జయంతి వేడుకలకు చిరంజీవిని ఆహ్వానించడం సరికాదన్న నారాయణ
- పవన్ ఎప్పుడు ఎలా ఉంటారో ఆయనకే తెలియదని కామెంట్
- ఏపీ నాయకులను బీజేపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శ
మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో ఇటీవల జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల గురించి ఆయన మాట్లాడుతూ... ఆ వేడుకకు సూపర్ స్టార్ కృష్ణను ఆహ్వానిస్తే చాలా బాగుండేదని అన్నారు. ఊసరవెల్లిలా వ్యవహరించే చిరంజీవిని వేడుకకు ఆహ్వానించడం సరికాదని చెప్పారు. పవన్ కల్యాణ్ ఒక ల్యాండ్ మైన్ వంటి వారని... ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో ఆయనకే తెలియదని అన్నారు.
ఏపీ నాయకులను బీజేపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి బ్లాక్ మెయిలింగ్ కు ఏపీ నేతలు భయపడుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయకపోయినా... ఎన్డీయే ప్రతిపాదించిన అభ్యర్థికి వైసీపీ, టీడీపీ ఎందుకు ఓట్లు వేశాయని ప్రశ్నించారు. ఏపీ రాజధాని అమరావతి అనే భావనను పోగొట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని అన్నారు. ఏపీకి రాజధాని కావాలనే ఆలోచన కూడా వైసీపీ నేతలకు లేదని.... ఇప్పటికీ హైదరాబాద్ నే రాజధానిగా వారు భావిస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన చేస్తున్న పోరాటం అభినందనీయమని నారాయణ అన్నారు. వరద తీవ్రతను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని చెప్పారు. వరద బాధితులను ఆదుకోవడంలో కూడా వైఫల్యం చెందిందని విమర్శించారు.