మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు కూతురు పెళ్లి.. చంద్రబాబుకు ఆత్మీయ ఆహ్వానం
- కాలవ కుమార్తె గౌతమి వివాహం నిశ్చయం
- నేడు చంద్రబాబుకు ఆహ్వాన పత్రికను అందించిన కాలవ
- ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న మాజీ మంత్రి
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు కుమార్తె గౌతమి వివాహం ఖరారైంది. ముహూర్తాలు కూడా ఖరారయ్యాయి. త్వరలోనే జరగనున్న ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లలో కాలవ శ్రీనివాసులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా తన కూతురు వివాహనికి హాజరు కావాలంటూ ఆయన పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును సోమవారం ఆహ్వానించారు.
ఈ మేరకు సోమవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన కాలవ... వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందజేశారు. అందుకు సంబంధించిన ఫొటోను కాలవ శ్రీనివాసులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన కుమార్తె వివాహానికి సంబంధించి అధినేతకు ఆత్మీయ ఆహ్వానం పలికానంటూ ఆ ఫొటోకు ఆయన ఓ కామెంట్‌ను జత చేశారు.