ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోమారు నిరాశ...బెయిల్ పిటిషన్ కొట్టివేత
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా అనంతబాబు
- రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైనం
- అనంతబాబుకు బెయిల్‌ను నిరాకరించిన కోర్టు
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోమారు నిరాశే ఎదురైంది. ఏపీలో రాజీకీయ ప్రకంపనలు రేపిన ఈ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న అనంతబాబు రిమాండ్‌ను ఇటీవలే కోర్టు పొడిగించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ అనంతబాబు మరోమారు రాజమహేంద్రవరం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు.. అనంతబాబుకు బెయిల్‌ను నిరాకరించింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని ఇప్పటికే ఓ సారి ఆయన కోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు తిరస్కరించిన సంగతి తెలిసిందే.