రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో 11 రాష్ట్రాల్లో 100 శాతం పోలింగ్‌: ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌ట‌న‌

  • ప్ర‌శాంతంగా పోలింగ్ ముగిసింద‌న్న ఈసీ
  • మొత్తం ఓట్లు వేయాల్సిన వారి సంఖ్య 4,796 
  • వారిలో 99 శాతం మంది ఓటు వేశార‌ని ప్ర‌క‌ట‌న‌
భార‌త నూత‌న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక కోసం సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 99 శాతం మంది స‌భ్యులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నార‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలిపింది. 11 రాష్ట్రాల్లో ఏకంగా 100 శాతం పోలింగ్ న‌మోదైందని పేర్కొంది. ఈ మేర‌కు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌పై సోమ‌వారం రాత్రి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన పోలింగ్ ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ముగిసింద‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో మొత్తం 4,796 మంది ఓట్లు వేయాల్సి ఉండ‌గా... వారిలో 99 శాతం మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నార‌ని వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా పీపీఈ కిట్ల‌లో పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్న ప్ర‌జా ప్ర‌తినిధుల ఫొటోల‌ను ఈసీ విడుద‌ల చేసింది.


More Telugu News