ప్రకాశ్ రాజ్ దర్శకుడిగా 'మనలో ఒకడు'
- నటుడిగా ప్రకాశ్ రాజ్ బిజీ
- అప్పుడప్పుడు దర్శకుడిగా ప్రయత్నాలు
- తన సినిమాలకి తానే నిర్మాత
- దర్శక నిర్మాతగా పట్టాలపైకి మరో ప్రాజెక్టు
ప్రకాశ్ రాజ్ తన అభిరుచికి తగిన సినిమాలను తెరకెక్కించడం కోసం అప్పుడప్పుడు దర్శకుడిగా మారుతుంటారు. గతంలో ఆయన 'ధోని' .. 'ఉలవచారు బిర్యాని' .. 'మన ఊరి రామాయణం' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలకు నిర్మాత కూడా ఆయనే. తన సొంత బ్యానర్లోనే వాటిని నిర్మించారు.
అయితే ఏ సినిమా కూడా ప్రేక్షకులను రంజింపజేయలేకపోయింది. నటుడిగా మంచి మార్కులను సంపాదించుకున్న ప్రకాశ్ రాజ్, దర్శక నిర్మాతగా మాత్రం సక్సెస్ కాలేకపోయారు. దర్శకత్వానికి కొంత గ్యాప్ ఇచ్చిన ఆయన, ఇప్పుడు 'మనలో ఒకడు' సినిమా కోసం మళ్లీ మెగాఫోన్ పడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
ఈ సినిమా కథ కూడా సమాజంలోని సమస్యల్లో నుంచి పుట్టిందే. టైటిల్లో చెప్పినట్టుగా కథానాయకుడు 'మనలో ఒకడు'. కొన్ని పెయింటింగ్స్ చూసిననప్పుడు మనం గీయడమే కరెక్టు అనిపిస్తుంది. అలాగే ఈ కథను నేను డైరెక్ట్ చేయడమే కరెక్ట్ అనిపించింది. అందువల్లనే మళ్లీ మెగాఫోన్ పడుతున్నాను. ఈ సినిమాను నేనే నిర్మిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.