రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన విజయేంద్ర ప్రసాద్
- రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎన్నికైన కథా రచయిత
- విజయేంద్ర ప్రసాద్‌తో ప్రమాణం చేయించిన వెంకయ్య
- విజయేంద్ర ప్రసాద్ సహా కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం
టాలీవుడ్ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ సోమవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి కోటాలో ఇటీవలే విజయేంద్ర ప్రసాద్‌ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు.
రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో భాగంగా విజయేంద్ర ప్రసాద్ కూడా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. అనంతరం ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం పనిచేస్తానని తెలిపారు. రాజ్యసభలో ప్రజా సమస్యలను లేవనెత్తుతానని, ప్రజా సమస్యలపై జరిగే చర్చల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటానని తెలిపారు. తన కథలే తనను ఇంత దూరం ప్రయాణించేలా చేశాయని ఆయన తెలిపారు.