టైటానిక్ ను కనుగొన్న నౌక.. సముద్రంలో చిత్రమైన జీవిని గుర్తించింది.. అదేమిటో తెలుసా?
- పసిఫిక్ మహా సముద్రంలో ‘సొలుంబెల్లులా మోనోసెఫలస్’ జీవిని కనిపెట్టిన ఈవీ నౌటిలిస్ నౌక
- సాధారణంగా ‘సీ పెన్’ గా పిలిచే చిత్రమైన జీవి
- ఇంతకుముందు కేవలం హిందూ, అట్లాంటిక్ మహా సముద్రాల్లో మాత్రమే కనిపించిన జీవి
- తాజాగా సముద్ర ఉపరితలం నుంచి మూడు కిలోమీటర్ల లోతున గుర్తింపు
సముద్ర అడుగు భాగంలో కనిపించే అత్యంత అరుదైన ‘సీ పెన్ (సొలుంబెల్లులా మోనోసెఫలస్)’ జీవిని తాజాగా పసిఫిక్ సముద్రం అడుగున గుర్తించారు. చూడటానికి ఓ ఆక్టోపస్ తరహాలో కనిపిస్తున్నా.. ఈ జీవి దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. పొడుగాటి గొట్టం వంటి నిర్మాణం (స్టాక్)తో సముద్రం అడుగు భాగానికి అతుక్కుని ఉండే ఈ జీవి.. నీటిలో మధ్యలో తేలుతున్నట్టుగా ఉంటూ, దానికి ఉన్న టెంటకిల్స్ తో ఆహారాన్ని పట్టేసుకుంటూ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పరిశోధక నౌక ఈవీ నౌటిలిస్ శాస్త్రవేత్తలు.. పసిఫిక్ మహా సముద్రంలోని జాన్ స్టన్ అటోల్ ప్రాంతంలో ఈ ‘సీ పెన్’ను గుర్తించారు.
టైటానిక్ ను కనిపెట్టింది ఈ నౌకతోనే..
- సముద్రపు నేలలోంచి రెండు మీటర్ల పొడవైన స్టాక్ తో వేలాడుతున్నట్టుగా ఉన్న ఈ ‘సీ పెన్’కు.. 40 సెంటీమీటర్ల వెడల్పున టెంటకిల్స్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
టైటానిక్ ను కనిపెట్టింది ఈ నౌకతోనే..
- 1914లో మంచు కొండను ఢీకొని మునిగిపోయిన టైటానిక్ నౌకను గుర్తించినది కూడా నౌటిలిస్ నౌక సాయంతోనే కావడం గమనార్హం.
- దీనితోపాటు సముద్రంలో మునిగిన ప్రఖ్యాత జర్మన్ యుద్ధ నౌక బిస్మార్క్ ను కూడా ఈ పరిశోధక నౌక శాస్త్రవేత్తలు, సిబ్బందే గుర్తించారు.
- మహా సముద్రాలపై తిరుగుతూ.. అడుగున ఉన్న విశేషాలపై ఈ నౌక పరిశోధనలు చేస్తూ ఉంటుంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కేంద్రంగా ఉన్న ‘ఓసియన్ ఎక్స్ ప్లోరేషన్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఈ నౌక నడుస్తుంది.
- ఇప్పటి వరకు సముద్రంలో ఎన్నో రకాల విశేషాలను, వింత వింత జీవులను నౌటిలిస్ నౌక గుర్తించింది.