వీల్ చెయిర్‌లో వచ్చి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్..వీడియో ఇదిగో
- రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న మాజీ ప్రధాని
- ఓటు వేసేందుకు ఇతరుల సహకారం తీసుకున్న మన్మోహన్
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు దాదాపుగా అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా సోమవారం మధ్యాహ్నం పార్లమెంటులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వీల్ చెయిర్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఇక ఓటు వేసేందుకు ఆయనకు ఇతరులు సహకరించడం జరిగింది. ఈ మేరకు ఆయన ఓటు వేస్తున్న సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2004 నుంచి 2014 వరకు వరుసగా రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా మన్మోహన్ వ్యవహరించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం 89 ఏళ్ల వయసులో ఉన్న మన్మోహన్... 2019లో రాజ్యసభ సభ్యుడిగా మరో మారు పదవి చేపట్టారు.