వర్షాకాలంలో ఈ కూరగాయలను తగ్గించుకుంటే నయం
- వాతావరణంలో అధిక తేమతో మందగించనున్న జీర్ణవ్యవస్థ పనితీరు
- పాలకూర, క్యాబేజీలకు దూరం
- ముల్లంగి, టమాటా, బీర, సొరకాయ తినొచ్చు
- వంకాయలతో అలర్జీ సమస్యలు
ఒక్కో సీజన్ లో తినకూడని కూరగాయలు కూడా ఉంటాయా? అని ఆశ్చర్యం కలగొచ్చు. కానీ, వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు కొన్నింటికి వర్షాకాలంలో దూరంగా ఉండడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. వర్షాలకు వాతావరణంలో తేమ పెరిగిపోతుంది. ఇదే బ్యాక్టీరియా, ఫంగస్ లు అధికంగా పెరిగేందుకు దారితీస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే రిస్క్ పెరిగిపోతుంది. అలాగే జీర్ణక్రియ నిదానించడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, అసిడిటీ సమస్యలు కనిపిస్తాయి. వర్షాకాలంలో ఏవి తీసుకోవాలన్నది పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఆకుపచ్చని కూరగాయలు
వర్షాలు కూరగాయల పంటలపై ప్రభావం చూపిస్తుంటాయి. దీనివల్ల పురుగులు, వాటి కారణంగా వ్యాధులు, బురద వల్ల కలుషిత ప్రమాదం ఉంటుంది. అందుకని వర్షాకాలంలో పాలకూర, క్యాబేజీని పక్కన పెట్టి, కాకరకాయ, బీరకాయ, సొరకాయకు వెళ్లొచ్చు. అలాగే, ముల్లంగి, వెల్లుల్లి, టమాటా, బెండకాయ తినొచ్చు.
వంకాయ మొక్కల్లో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఈ హానికారక కాంపౌండ్ క్రిమి కీటకాల నుంచి రక్షణ కల్పిస్తుంది. కనుక వంకాయలను వర్షాకాలంలో దూరం పెట్టడం మంచిది. వంకాయ వల్ల అలర్జీలు కూడా కనిపించొచ్చు.
అధిక తేమతో కూడిన వాతావరణం జీర్ణశక్తిని మందగింపజేస్తుంది. పకోడీలు, సమోసాలు, కచోడీలు జీర్ణ సమస్యను కలిగిస్తాయి. కడుపు ఉబ్బరం వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు కనిపిస్తాయి. అధిక ఉప్పుతో కూడిన ఆహారం తీసుకుంటే శరీరంలో నీరు ఎక్కువగా ఉండిపోతుంది. ఈ కాలంలో వీధుల్లోని ఆహార పదార్థాలను ముట్టుకోకూడదు. ముఖ్యంగా పానీపూరీని ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు. బ్యాక్టీరియా కారణంగా ఇవ్ఫెక్షన్లు పెరుగుతాయి.
డ్రింక్స్
కార్బొనేటెడ్ డ్రింక్స్ (కోక్, స్ప్రైట్ వంటివి) తాగినప్పుడు శరీరం లవణాలను కోల్పోతుంది. దీనివల్ల ఎంజైమ్ ల ఉత్పత్తి తగ్గిపోతుంది. అసలే వర్షాకాలం వల్ల మందగించిన జీర్ణ వ్యవస్థ పనితీరును ఇది మరింత క్షీణించేలా చేస్తుంది.
మాంసం, సముద్రపు ఉత్పత్తులు
నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు, ఫుడ్ పాయిజినింగ్ కు దూరంగా ఉండాలంటే, వర్షాకాలంలో మాంసం, సముద్రపు ఉత్పత్తులను తీసుకోకపోవడమే మంచిది.