ఓటు వేసిన సీఎం జగన్ .. వీడియో ఇదిగో!
- కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ
- అసెంబ్లీ కమిటీ హాల్ లో ఓటు వేసిన జగన్
- 21వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు
భారత రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. అధికార ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ పడుతున్నారు. దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏపీలో ద్రౌపది ముర్ముకే వైసీపీ, టీడీపీలు మద్దతును ప్రకటించాయి. కాసేపటి క్రితం ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్ లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఢిల్లీలోని పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 21వ తేదీన పార్లమెంట్ హౌస్ లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు.