జగ్ దీప్ ధన్‌ఖడ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి
- ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీలో జగ్ దీప్ ధన్‌ఖడ్
- ఈ రోజు నామినేషన్ వేయనున్న జగ్ దీప్
- ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నిక
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా జగ్ దీప్ ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతిభవన్ ప్రకటించింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ధన్‌ఖడ్ పేరును బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో, ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీన్ని రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు.
కాగా, జగ్ దీప్ రాజీనామా చేయడంతో పశ్చిమ బెంగాల్ కు తాత్కాలిక గవర్నర్‌గా గణేశన్ ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. గణేశన్ ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ధన్‌ఖడ్ నియమితులయ్యారు.
మరోవైపు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ధన్‌ఖడ్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంగళవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకురాలు మార్గరెట్ ఆల్వా బరిలో నిలిచారు. మంగళవారం ఆల్వా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరుగుతుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీతో ముగియనుంది.