తెలంగాణలో నేడు భారీ వర్షాలు: వాతావరణశాఖ

  • తెలంగాణను వీడని వర్షాలు
  • బంగాళాఖాతం నుంచి భూమి ఉపరితలంపైకి వచ్చిన అల్పపీడనం
  • రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
తెలంగాణను వర్షాలు వీడడం లేదు. నేడు భారీగా, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లి నిన్న మళ్లీ భూమి ఉపరితలంపైకి వచ్చింది. సాయంత్రానికి ఒడిశా తీరంపై కేంద్రీకృతమైంది.

దీనికి అనుబంధంగా గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో నేడు భారీగా, రేపు ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.


More Telugu News