వెంకయ్యను జగన్ అడ్డుకున్నారన్న టీడీపీ ప్రచారంలో నిజం లేదు: విజయసాయిరెడ్డి

  • ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు
  • ముగియనున్న వెంకయ్య పదవీకాలం
  • టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్న విజయసాయి
  • వెంకయ్యపై నిర్ణయం తీసుకుంది బీజేపీనే అని వెల్లడి
ఆగస్టు 10తో భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 6న ఎన్నికలు జరగనుండగా, మరోసారి వెంకయ్యనాయుడుకు అవకాశం లేదని తేలిపోయింది. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధ‌న్‌ఖడ్
పేరును అధికారికంగా ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. వెంకయ్యకు పొడిగింపు లేదన్నది బీజేపీ నిర్ణయం అని స్పష్టం చేశారు. కానీ, వెంకయ్యను జగన్ అడ్డుకున్నారంటూ టీడీపీ ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ కొత్త పల్లవి వాస్తవం కాదని తెలిపారు. భారత ఖండంబు చీలిపోతుందని, ప్రజాస్వామ్యానికే అపాయం అని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పచ్చ కుల మీడియా ఉడత ఊపులు విడ్డూరం, అసంబద్ధం అని విజయసాయి పేర్కొన్నారు.


More Telugu News