వదలని వాన... కోస్తాంధ్ర, తెలంగాణలకు మరో ఐదు రోజులు వర్షసూచన

వదలని వాన... కోస్తాంధ్ర, తెలంగాణలకు మరో ఐదు రోజులు వర్షసూచన
  • ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు
  • నేడు కూడా భారీ వర్షాలు పడే అవకాశం
  • ఉత్తరాంధ్రకు ఇవాళ భారీ వర్షసూచన
  • రాయలసీమలోనూ వర్షాలు పడే అవకాశం
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణను అతలాకుతలం చేసిన వరుణుడు మరోసారి ప్రభావం పలకరించేందుకు సిద్ధమయ్యాడు. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా వాతావరణ నివేదిక వెలువరించింది. దీని ప్రకారం... కోస్తాంధ్ర, తెలంగాణలో మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. 

అదే సమయంలో రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లోనూ కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. నేడు ఉత్తరాంధ్ర, యానాంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని, రేపు (జులై 18) తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.


More Telugu News