పార్లమెంటులో అఖిలపక్ష భేటీ... ప్రధాని గైర్హాజరును ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ
- పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ
- వైసీపీ నుంచి సాయిరెడ్డి, మిథున్ రెడ్డి హాజరు
- టీడీపీ నుంచి కనకమేడల, గల్లా హాజరు
- టీఆర్ఎస్ తరఫున హాజరైన కేకే, నామా
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఆదివారం పార్లమెంటు ఆవరణలో అధికార కూటమి ఎన్డీఏ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. అఖిలపక్ష సమావేశానికి ఇదివరకటి మాదిరిగానే మోదీ డుమ్మా కొట్టారన్న రమేశ్... ఇది అన్‌పార్లమెంటరీనేనని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే... ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీ నుంచి ఆ విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి హాజరు కాగా... విపక్ష టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్‌లు హాజరయ్యారు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కె.కేశవరావు, నామా నాగేశ్వరరావులు హాజరయ్యారు.