సింగపూర్ ఓపెన్ టైటిల్ విజేత పీవీ సింధు
- చైనాకు చెందిన వాంగ్ జీ యీని మట్టి కరిపించిన సింధు
- 21-9, 11-21,21-15 స్కోరుతో విజయం
- ఈ ఏడాదిలో సింధు ఖాతాలో ఇది మూడో టైటిల్
తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. సింగపూర్ ఓపెన్ ఫైనల్లో నెగ్గిన సింధు... టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం ఉదయం జరిగిన టైటిల్ పోరులో ఆమె చైనాకు చెందిన వాంగ్ జీ యీని మట్టి కరిపించి విజేతగా నిలిచింది. 21-9, 11-21, 21-15 స్కోరుతో సింధూ ఫైనల్‌లో విజయం సాధించింది.
ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు టైటిళ్లు నెగ్గిన పీవీ సింధు.. తాజాగా సింగపూర్ ఓపెన్ టైటిల్‌తో కలిపి మొత్తం మూడు టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. మొన్న క్వార్టర్స్ చేరిన సింధు... సెమీస్‌ను కూడా ఈజీగానే గెలిచింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో తొలి గేమ్ ను అలవోకగా గెలిచిన సింధు.. రెండో గేమ్ లో అనూహ్యంగా ఓటమిపాలైంది. మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే మూడో గేమ్ లో తిరిగి శక్తిని కూడదీసుకున్న సింధు... తన ప్రత్యర్థి ఏమాత్రం కోలుకోకుండా మెరుపు దాడి చేసింది.