మణిపూర్​లో స్వల్ప భూకంపం

  • శనివారం రాత్రి  11:42 గంటలకు కంపించిన భూమి
  • రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రత నమోదు
  • ఈనెల 5న అస్సాంలోనూ భూకంపం
మణిపూర్ లో స్వల్ప భూకంపం సంభవించింది. మణిపూర్‌లోని మోయిరాంగ్‌కు తూర్పు-ఆగ్నేయంలో శనివారం రాత్రి 11:42 గంటలకు భూమి కంపించడంతో ప్రజలకు అందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూకంప కేంద్రం లోతు 94 కి.మీ.గా ఉందని చెప్పింది. 
 
అంతకుముందు ఈ నెల 5న అస్సాంలో రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 11:03 గంటలకు సంభవించిన భూకంపం యొక్క లోతు 35 కి.మీ. గా ఎన్సీఎస్ గుర్తించింది. దేశంలో భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఎన్సీఎస్ భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా పని చేస్తోంది.


More Telugu News