కేసీఆర్ వీరాభిమాని ఈమే!.. ఫొటోలతో జిందం సత్తమ్మను పరిచయం చేసిన కేటీఆర్!
- రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన జిందం సత్తమ్మ
- తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్నారన్న కేటీఆర్
- నాటి నుంచి తనకు మద్దతు పలుకుతున్నారని వెల్లడి
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదివారం తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్‌ను పోస్ట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ అధినేతకు వీరాభిమాని ఈమేనంటూ జిందం సత్తమ్మ అనే మహిళను పరిచయం చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె గురించిన పలు ఆసక్తికర విషయాలను కేటీఆర్ వెల్లడించారు.
ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకున్న జిందం సత్తమ్మ ఇప్పటికీ అదే స్ఫూర్తితో కొనసాగుతోందని కేటీఆర్ తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె టీఆర్ఎస్‌తో పాటు పార్టీ అధినేత కేసీఆర్‌కు వీరాభిమానిగా మారిపోయారని పేర్కొన్నారు. నాటి నుంచి నేటి దాకా ఆమె తనకు మద్దతు పలుకుతున్నారని కూడా కేటీఆర్ వెల్లడించారు. జిందం సత్తమ్మ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారేనని కూడా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమ సమయంలో తనతో కలిసి కదం తొక్కిన సత్తమ్మ ఫొటోను కేటీఆర్ తన ట్వీట్‌కు జత చేశారు.