నటి వరలక్ష్మి శ‌ర‌త్‌కుమార్‌కు క‌రోనా పాజిటివ్

  • స్వ‌యంగా వెల్ల‌డించిన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌
  • జాగ్ర‌త్త‌గా ఉన్నా క‌రోనా సోకింద‌ని వెల్ల‌డి
  • సెట్స్ లో సిబ్బంది మాస్కులు పెట్టుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని న‌టుల‌కు సూచ‌న‌
త‌మిళం, తెలుగు సినిమాల్లో ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇచ్చిన ప్ర‌ముఖ న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కరోనా బారిన ప‌డ్డారు. ఈ మేర‌కు ఆదివారం ఉద‌యం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్వ‌యంగా ఆమెనే విష‌యాన్ని వెల్ల‌డించారు. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ త‌న‌కు క‌రోనా సోకింద‌ని ఆమె ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ క్ర‌మంలో త‌న‌ను క‌లిసిన వారు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, అవ‌స‌ర‌మైతే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆమె పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే... సెట్స్ లో సినీ న‌టులు త‌మ సిబ్బంది మాస్కులు ధ‌రించేలా ఇక‌నైనా ఒత్తిడి తీసుకురావాల‌ని వ‌ర‌ల‌క్ష్మి కోరారు. న‌టులుగా నిత్యం మాస్కులు పెట్టుకోవ‌డం కుద‌ర‌ద‌ని తెలిపిన ఆమె.. క‌నీసం సిబ్బంది అయినా మాస్కులు పెట్టుకుంటే క‌రోనాను నియంత్రించ‌వ‌చ్చ‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. వ‌ర‌ల‌క్ష్మి పోస్ట్‌ను చూసిన వారంతా క‌రోనా నుంచి ఆమె త్వ‌ర‌గా కోలుకోవాలంటూ కోరుతూ ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు.


More Telugu News