వెంకయ్యనాయుడిపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఆసక్తికర ట్వీట్!
- ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ధన్‌ఖడ్ ఎంపిక
- త్వరలోనే ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న వెంకయ్య
- వెంకయ్య ప్రస్థానంపై జైరాం రమేశ్ ట్వీట్
ఉపరాష్ట్రపతిగా కొనసాగుతున్న తెలుగు నేత ముప్పవరపు వెంకయ్యనాయుడిపై కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ ఆసక్తికర ట్వీట్‌ను పోస్ట్ చేశారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అధికార ఎన్టీఏ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేస్తున్న జగదీప్ ధన్‌ఖడ్ ను ఎంపిక చేస్తూ బీజేపీ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఉపరాష్ట్రపతిగా వెంకయ్యకు మరో అవకాశం లేదని తేలిపోయింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
వెంకయ్య అవకాశాలకు తెరపడిపోయిందని తన ట్వీట్‌లో జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. వెరసి వెంకయ్య చమత్కారం, చాతుర్యాన్ని మిస్ అవుతున్నామని ఆయన పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో విపక్షాలు ఆందోళనకు దిగేలా వెంకయ్య వైఖరి ఉన్నా... చివరకు ఆయన ఓ మంచి మనిషిగానే పదవి నుంచి దిగిపోతున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పదవి నుంచి విరమణ తీసుకుంటున్నా... వెంకయ్య అలసిపోడని నాకు తెలుసు అంటూ జైరాం రమేశ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.