రాష్ట్రంలో వైసీపీ మైనింగ్ మాఫియా చెలరేగిపోతోంది: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
- రాష్ట్రంలోని 150 నియోజకవర్గాల్లోనూ మైనింగ్ అక్రమంగా జరుగుతోందన్న మాజీ మంత్రి
- జగన్ పాలనలో నియోజకవర్గానికో గాలి జనార్దన్‌రెడ్డి తయారయ్యాడన్న టీడీపీ నేత
- శేఖర్‌రెడ్డి పేరుతో జగన్ ఇసుకను దోచుకుంటున్నారని ఆరోపణ
రాష్ట్రంలో వైసీపీ మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. కొండల్ని, గుట్టల్ని ఆ మాఫియా మాయం చేస్తోందని, ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆనందబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో నియోజకవర్గానికో గాలి జనార్దన్‌రెడ్డి తయారయ్యాడని ధ్వజమెత్తారు. ప్రకృతి వనరులను, ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తున్నారని అన్నారు.
150 నియోజకవర్గాల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతోందని అన్నారు. విశాఖలో ఏకంగా రుషికొండే కనుమరుగైందన్నారు. మన్యం ప్రాంతంలో వైవీ సుబ్బారెడ్డి రూ. 15 వేల కోట్ల బాక్సైట్ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. శేఖర్‌రెడ్డి పేరుతో జగన్ ఇసుకను దోచుకుంటున్నారని.. వీటన్నింటిపైనా న్యాయ విచారణ జరగాలని నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని ఆయన పేర్కొన్నారు.