వినయానికి ప్రతిరూపం ధన్‌ఖడ్!.. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై మోదీ ప్రశంస!
- ధన్‌ఖడ్ ను రైతు బిడ్డగా అభివర్ణించిన మోదీ
- న్యాయవాదిగానే కాకుండా ప్రజా ప్రతినిధిగా రాణించారని ప్రశంస
- భారత రాజ్యాంగంపై ధన్‌ఖడ్ కు మంచి పట్టుందన్న ప్రధాని
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎన్నికైన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాశానికెత్తేశారు. ధన్‌ఖడ్ వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా మోదీ రెండు వరుస ట్వీట్లు చేశారు.
ధన్‌ఖడ్ ను రైతు బిడ్డగా పరిచయం చేసిన మోదీ... వినయానికి ధన్‌ఖడ్ ప్రతిరూపమని పేర్కొన్నారు. న్యాయవాదిగా, ప్రజా ప్రతినిధిగా ధన్‌ఖడ్ అపార అనుభవాన్ని గడించారని మోదీ తెలిపారు. రైతులు, యువత, మహిళలు, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ధన్‌ఖడ్ అవిశ్రాంత కృషి చేశారని ఆయన తెలిపారు.
భారత రాజ్యాంగంపై ధన్‌ఖడ్ కు మంచి పట్టు ఉందని మోదీ తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాలపైనా ధన్‌ఖడ్ కు అపార అవగాహన ఉందని పేర్కొన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా ధన్‌ఖడ్ అత్యుత్తమంగా రాణిస్తారన్న నమ్మకం తనకుందని మోదీ తెలిపారు. విభిన్న రంగాలపై అపార అనుభవం కలిగిన ధన్‌ఖడ్ ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం తనకు సంతోషాన్నిచ్చిందని మోదీ పేర్కొన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీకి ముందు తనను కలిసిన జగదీప్ ఫొటోలను మోదీ తన ట్వీట్లకు జత చేశారు.