మోదీతో భేటీ కోసం ఢిల్లీకి క్యూ కట్టిన రాష్ట్రాల గవర్నర్లు
- ఒకే రోజు ఢిల్లీకి వచ్చిన నలుగురు గవర్నర్లు
- మోదీతో వరుసగా భేటీ అయిన వైనం
- ప్రధానితో భేటీ అయిన ధన్ కర్, గణేశన్, మంగూభాయి, ఆర్లేకర్
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కోసం దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్లు శనివారం ఢిల్లీకి క్యూ కట్టారు. శనివారం ఒక్కరోజే ఏకంగా నలుగురు గవర్నర్లు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వీరిలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ధన్ కర్, మణిపూర్ గవర్నర్ గణేశన్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయి పటేల్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌లు ఉన్నారు.
శనివారం ఉత్తరప్రదేశ్‌లోని జలాన్‌కు వెళ్లిన మోదీ... అక్కడ కొత్తగా నిర్మించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని ఢిల్లీ వచ్చిన మోదీ...వరుసబెట్టి గవర్నర్లతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైన వేళ ఇలా గవర్నర్లు మోదీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.