మా ఎమ్మెల్యేల్లో ఒక్కరు ఓడిపోయినా రాజకీయాల నుంచి తప్పుకుంటా: మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే

  • దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలన్న ఉద్ధవ్ థాకరే
  • తమకు ఓటమిభయం లేదన్న షిండే
  • గెలుపోటములు ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడి
రెబెల్ శివసేన ఎమ్మెల్యేలకు దమ్ముంటే ఎన్నికలకు సిద్ధపడాలని, వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే సవాల్ విసిరారు. దీనిపై సీఎం ఏక్ నాథ్ షిండే బదులిచ్చారు. ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేలు ఒక్కరు ఓడిపోయినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని దీటుగా బదులిచ్చారు. 

"రెబెల్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా గెలవరని అంటున్నారు... కానీ వారిలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఓడిపోరని నేనంటున్నాను... ఒకవేళ ఓడిపోతే అందుకు నేనే బాధ్యత తీసుకుంటాను. అయినా, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో చెప్పడానికి మీరెవరు? గెలుపోటముల నిర్ణేతలు ప్రజలే. ఎవరు గెలవాలో, ఎవరు ఓడిపోవాలో వారు నిర్దేశిస్తారు" అని బదులిచ్చారు.


More Telugu News